ఏపీ సర్కార్ కు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం..! ఇక తాడోపేడో..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో పలుమార్లు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వారు ఇవాళ అల్టిమేటం ఇచ్చారు. పరిస్దితిలో మార్పు రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరు సంవత్సరాలనుండి ఒకే క్యాడర్ లో పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అపరిష్కృత సమస్యలపై సచివాలయాల శాఖ అధికారులకు, ప్రభుత్వానికి తాజాగా మరోసారి వినతిపత్రం ఇవ్వాలని వారు నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సర్వీస్ రెగ్యులరైజేషన్ ను డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి తీసుకొని నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు అప్ గ్రేడ్ చేయాలని, రెండు సంవత్సరాల కాలపరిమితి ముగియగానే చేయవల్సిన ప్రోబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందుకు చెల్లించవలసిన ఎరియర్స్ చెల్లించాలని, అన్నీ జిల్లాల్లో అన్నీ విభాగాల సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు మెరిట్ కం రోస్టర్ విధానంలో ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తదుపరి పదోన్నతి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా పదోన్నతి ఛానల్ రూపొందించాలని,సచివాలయ ఉద్యోగులను అవకాశం ఉన్న మేరకు అర్హత ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని కోరుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలపై ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల విధానాన్ని అనుసరించి ప్రత్యేక విధానం కల్పించాలని, అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని కోరారు.

సచివాలయ ఉద్యోగులకు సబ్సిడీతో ఇళ్ళ స్థలాలు కేటాయించాలని,ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నట్లు నాయకులు ప్రకటించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications