AP Weather: ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా అల్పపీడనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలోనున్న ఉపరితల ఆవర్తనము ప్రభావం వలన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.

వాయుంగుండంగా అల్పపీడనం

వాయుంగుండంగా అల్పపీడనం

అల్పపీడనంకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టమునకు 4 .5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి , ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరు కొనే అవకాశం ఉందని తెలిపారు.

మూడు రోజులపాటు కోస్తా, యానాంలో వర్షాలు

మూడు రోజులపాటు కోస్తా, యానాంలో వర్షాలు

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. ఇక బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, గురువారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
    దక్షిణ కోస్తా, సీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు

    దక్షిణ కోస్తా, సీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు

    దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం తేలిక పాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమలోనూ మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే తాము వేసిన పంటలు పూర్తిగా నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+