Weather update: ఏపీలో రానున్న మూడ్రోజులపాటు వర్షాలు, అల్పపీడనం ఎఫెక్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం దక్షిణమధ్య బంగాళాఖాతంలో 'అల్పపీడనం' ఏర్పడిందని పేర్కొంది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. రాగల 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తర్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

బుధవారం యానాం, ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
దక్షిణ కోస్తాంధ్రాలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Recommended Video
రాయలసీమలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications