Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ సినిమాలతోనే మహిళల మిస్సింగ్..! వాసిరెడ్డి పద్మ మరో ఆరోపణ..

ఏపీలో భారీ ఎత్తున మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేశారు. దీనిపై అప్పట్లో వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నారని, పవన్ కు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం మహిళల మిస్సింగ్ డేటా బయటపెట్టడంతో దీనిపై ఇవాళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభ లో కేంద్ర మంత్రి ప్రకటన చేశారంటూ పవన్ హడావిడి చేస్తున్నారని, టాప్ టెన్ లో ఉన్న మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లెక్కలు ఎంపీలు ఎందుకు అడగడం లేదని ఆమె ప్రశ్నించారు.

ఏపీలోని మహిళల మిస్సింగ్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు తాపత్రయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.ఏపీ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారని అడిగారు. మీది రాజకీయపరమైన కోపమా? రాష్ట్రం మీద కోపమా అని నిలదీశారు.11వ రాష్ట్రం గా ఉన్న ఏపీ మీద మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. రాజ్యసభలో కొంతమంది ఎంపిల చేత ఆడిగిస్తున్నారని ఆరోపించారు.

vasireddypadma1

వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్ కళ్యాణ్ ..పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా మహిళల మిస్సింగ్స్ జరుగుతుందో చెప్పగలరా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.సినిమాల ద్వారా లవ్ స్టొరీలు తీస్తున్న పవన్ కళ్యాణ్, ఆయన ప్రొడ్యూసర్స్ మహిళల మీద దాడులకు ప్రేరేపించడం లేదా? అని అడిగారు. ఏపీ లో ఆడవాళ్ళు గౌరవంగా ఉండడానికి వాలంటీర్స్ ఒక కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు సంబంధించి అన్ని పధకాలను వాలంటీర్స్ ఇంటికి తీసుకెళుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు, పిచ్చి పుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థ ల మీద పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె విమర్శించారు. మహిళలు సమక్షంలో రచ్చబండ పెడదాం, పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే రచ్చబండకి రావాలన్నారు.పవన్ కు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసన్నారు. సీఎం జగన్ కు మహిళల్ని ఆదుకోవడం తెలుసన్నారు.పవన్ తీస్తున్న సినిమాల వల్లనే మహిళలు అదృశ్యం అవుతున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+