జగన్ కు మోడీ పుల్ సపోర్ట్..! అందుకే ఇవన్నీ.! వైఎస్ షర్మిల షాకింగ్..!
ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోడీపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్ారు. యోగాంధ్ర కోసం విశాఖ వచ్చే ప్రధాని మోడీని ఈ సారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా ? లేదా ? అని షర్మిల ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయని, ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి మోడీ వస్తున్నారని నిలదీశారు. మరోవైపు అన్న వైఎస్ జగన్ .. రఫ్ఫా రఫ్ఫా నరుకుతాం వ్యాఖ్యలను సమర్థించడాన్ని షర్మిల తప్పుబట్టారు.
ప్రధాని మోడీ విశాఖకు వస్తున్నారు, పోతున్నారని, ప్రధాని కాబట్టి భద్రత దృష్ట్యా ఎవరూ ప్రశ్నించడం లేదని షర్మిల ఆరోపించారు. విభజన హామీలు ఇచ్చి 10 ఏళ్లు దాటిందని,తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ప్రత్యేక హోదా విభజన హక్కు అని షర్మిల తెలిపారు. హోదా విషయంలో మోడీ చేసింది మోసమన్నారు. దీనిపై కనీసం మోడీ నుంచి స్పందన లేదన్నారు. మోడీ మోసం చేస్తున్న కూడా బాబు,పవన్ మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు.

పోలవరం మీద కూడా మోడీ మోసం చేశారని, ఎత్తు తగ్గించి ప్రాజెక్ట్ ప్రాణం తీశారని షర్మిల ఆరోపించారు. 45 మీటర్ల నుంచి 41 తగ్గించి మోసం చేశారన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆది ప్రాజెక్ట్ కాదని, ఆది బ్యారేజి అవుతుందన్నారు. విశాఖ స్టీల్ విషయంలో మోసమే అన్నారు. ప్రైవేటీకరణ లేదు అని.. ప్లాంట్ ను అమ్మేస్తున్నారన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పు లేదని అంటున్నారని, ప్లాంట్ లో 4 వేల కార్మికులను తొలగించారని గుర్తుచేశారు.
అలాగే రాజధాని కడతామని అప్పులు ఇస్తున్నారని,అప్పులతో రాజధాని కట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మోడీ మోసం చేస్తున్నా, వెన్నుపోటు పొడుస్తున్నా బాబు పవన్ మద్దతు ఇస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర కి ప్రత్యేక ప్యాకేజీ అంటూ మోసమే చేశారన్నారు. ప్రజల సమస్యల పట్టింపు లేకుండా... యోగాంధ్ర అవసరమా అని అడిగారు.

మరోవైపు జగన్ మాటలు చాలా దురదృష్టకరమని షర్మిల తెలిపారు. వైసీపీకి నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడకూడదన్నారు.
ఇవి రెచ్చగొట్టే, హింసాత్మక వ్యాఖ్యలన్నారు. నరుకుతాం, సంపుతాం, బట్టలు ఊడదీస్తాం అంటూ జగన్ మాట్లాడటం ఏంటన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. జగన్ కి మోడీ సపోర్ట్ ఉందని, వివేక హత్య నే కాదు అన్ని విషయాల్లో సపోర్ట్ ఉందన్నారు. అందుకే ఆయన ఏమి చేసినా చెల్లుతుందన్నారు. అందుకే బహిరంగంగా జగన్ విచ్చలవిడిగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications