Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. ఎండలు మండుతున్న వేళ రానున్న అయిదు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆస్ట్రేలియా వైపు మైలా, వలను అనే రెండు తుఫాన్లు ఏర్పడగా.. హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు (సోమవారం) పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి గోదావరి, తిరుమల, చిత్తూరు లో వర్షాలు పడ్డాయి. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగు తున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా,
40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

తిరుపతికి కొత్తగా అమృత్‌ భారత్‌, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
తిరుపతికి కొత్తగా అమృత్‌ భారత్‌, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
apsdma-alerts-over-chances-for-heavy-rains-in-godavari-chittoor-districts-for-next-two-days-here

అయిదు రోజుల పాటు భారీ వర్షాలు

ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక రాయలసీమలో ఎండ ప్రభావం ఉంటుందని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతాయని స్పష్టం చేశారు. 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి స్వల్ప వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇక సాయంత్రం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వానలు కురుస్తాయంది. ఈదురుగాలులు 26 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, బైక్‌పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో ఎండ తీవ్రత ఉండే అవకాశముంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+