ఏపీ కొత్త కేబినెట్ ప్రమాణానికి ముహుర్తం ఇదే-భారీ ఏర్పాట్లు-పాత వేదికే- కరకట్ట రోడ్ రిజర్వ్

ఏపీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్ 11న ఉదయం 11.35 నిమిషాలకు అమరావతి సచివాలయం భవనాల పక్కనే ఉన్న ఖాళీ స్ధలంలో కేబినెట్ మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 11వతేదీన రాష్ట్ర సచివాయలం ప్రక్కన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను,పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.

arrangements for jagan cabinet expansion on april 11, karakatta road reserved for VIPs

మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం జగన్ తన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు పొటోకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్, సమాచారశాఖ అధికారులను కూడా సీఎస్ ఆదేశించారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ముత్యాలరాజు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, గవర్నర్, సీఎం, మంత్రులుగా నియమించబడిన వారికి ఆహ్వానం పలకడం వంటి ఏర్పాట్లు, వారికి తగిన రవాణా సౌకర్యం వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించే విధంగా కొంతమంది ప్రోటోకాల్ అధికారులను నియమిస్తున్నట్టు ముత్యాల రాజు సిఎస్ కు వివరించారు.

అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వతేదీన కరకట్ట రోడ్డును గవర్నర్,ముఖ్యమంత్రి,హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపీ, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు వంటి ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.అదే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+