భూమా నాగిరెడ్డికి షాక్: నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ జారీ

Subscribe to Oneindia Telugu

కర్నూలు: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై స్థానిక ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రామమోహన్‌ సోమవారం అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. నిరుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీఎస్‌పీ దేవదానం పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది.

డీఎస్పీని భూమా నాగిరెడ్డి కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు.

Arrest Warrant issued to Bhuma Nagireddy

కాగా, కేసు విచారణకు సంబంధించి న్యాయస్థానంలో నాగిరెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో మేజిస్ట్రేట్‌ సోమవారం అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. కాగా, భూమా నాగిరెడ్డి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Arrest Warrant has been issued to Telugudesam MLA Bhuma Nagi Reddy.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి