జగన్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే రాజేశ్వరీ: ఆ విభేదాలే కారణమా?

Posted By:
Subscribe to Oneindia Telugu
  జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ టీడీపీలోకి నెక్స్ట్ ఏంటి జగన్ ? | Oneindia Telugu

  హైదరాబాద్: రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరీ వైసీపీని వీడి టిడిపిలో చేరడానికి స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

  ఏపీ రాష్ట్రంలో వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 6వ, తేది నుండి పాదయాత్ర నిర్వహించనున్నారు.

  జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలో ఆ పార్టీ నుండి భారీగా వలసలను ప్రోత్సహించాలని టిడిపి వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.ఈ వ్యూహంలో భాగంగానే రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరీ టిడిపిలో చేరారు.

   ఆ విబేధాలే రాజేశ్వరీ టిడిపిలో చేరడానికి కారణమా

  ఆ విబేధాలే రాజేశ్వరీ టిడిపిలో చేరడానికి కారణమా

  రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరీ కుటుంబం మొదటి నుండి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం.అడ్డతీగల మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె అనంతరం కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ రంపచోడవరం అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన ఆమె అదే రీతిలో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అడ్డతీగలలో దశాబ్దన్నర కాలంనుంచి కాంగ్రెస్‌, వైసీపీలోనూ కీలకనేతగా ఉన్న అనంత ఉదయభాస్కర్‌(బాబు) రాజేశ్వరికి టిక్కెట్టు ఇప్పించారంటారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో ఆమె విజయానికి ఆయన కారణమయ్యారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో ఉంది. అయితే ఇటీవల కాలంలో రాజేశ్వరీకి అనంతబాబుకు మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో పెరగడం వల్లే ఆమె పార్టీ మారిందనే ప్రచారం కూడ సాగుతోంది.

  గ్రూపుల పంచాయితీ కారణమేనా

  గ్రూపుల పంచాయితీ కారణమేనా


  రాజేశ్వరి, అనంతబాబులు ఒకే తాటిపై, ఒకే మాటపైన కొంతకాలం నడిచారు. అనంతరం కొంతకాలానికి వీరి మధ్య చాపకింద నీరులా మొదలైన విభేదాలు తీవ్రస్థాయిలో చేరుకున్నాయి. దీంతో ఒకే పార్టీలో రెండు వైరి వర్గాలుగా విడిపోయారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఎవరికి వారు తమ ఉనికిని చాటుకుంటూ వచ్చారు. అంతేకాదు వీరి మధ్య విభేధాలు వైసీపీ చీఫ్ జగన్‌ వద్దకు చేరాయి. కానీ, ఈ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజేశ్వరీ టిడిపిలో చేరారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  గతంలోనే రాజేశ్వరీపై ప్రచారం

  గతంలోనే రాజేశ్వరీపై ప్రచారం

  వైసీపీ నుండి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల వలసలు సాగిన సందర్భంలోనే రాజేశ్వరి టిడిపిలో చేరుతారనే చేరిపోతారని ప్రచారం
  సాగింది. కానీ, ఆ సమయంలో ఆమె వైసీపీలోనే ఉన్నారు.కానీ, అనుహ్యంగా శనివారం నాడు రాజేశ్వరీ వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఈ పరిణామం వైసీపీ వర్గాల్లో కలవరానికి గురిచేసింది.

  పాదయాత్రలో షాకిచ్చేందుకు టిడిపి వ్యూహం

  పాదయాత్రలో షాకిచ్చేందుకు టిడిపి వ్యూహం

  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర సాగిస్తున్న సమయంలో ఆంధ్రప్రాంతంలో వైసీపీ, తెలంగాణలో టిఆర్ఎస్‌ నేతలు టిడిపి ఎమ్మెల్యేలపై గాలం వేశారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో టిడిపి నుండి ఈ రెండు పార్టీల్లోకి ఎమ్మెల్యేలు వలసలు వెళ్ళారు. పాదయాత్ర సాగతున్న తరుణంలోనే వ్యూహత్మకంగా టిడిపిని దెబ్బతీసేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం టిడిపి కూడ వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇదే వ్యూహన్ని అమలు చేయాలని భావిస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party chief Jagan Mohan Reddy visited the temple town of Tirumala to seek blessings before embarking on the massive “Praja Sankalpa Yatra”, with an eye on 2019 assembly elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి