బాలయ్య కొడుకు మోక్షజ్ఞ జాతకం చెప్పిన వేణుస్వామి
ప్రస్తుతం రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు జాతకం చెబుతూ ఆయన కూడా ఒక సెలిబ్రిటీ అయిపోయారు. జాతకం చెప్పే సమయంలో ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనాలకు కారణమవుతున్నాయి. దీంతో ఏదైనా వీడియో సోషల్ మీడియాలో ఒకరికి కనపడితే చాలు.. తర్వాత దానంతటదే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైవుంటుంది.. ఆయనెవరు అనేది.. వేణుస్వామి.
జాతకాలు చెప్పే సమయంలో వారి జాతకానికి సంబంధించిన చేసే వ్యాఖ్యలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సమంత-నాగచైతన్య విడాకుల గురించి చెప్పారు. అలాగే జరిగింది. తర్వాత మరికొందరి గురించి చెప్పారు.. అటూ ఇటూగా కాస్తంత ప్రభావాన్ని చూపడంతో గతంలో వేణుస్వామి ఎవరి గురించి చెప్పాడు? ఏం చెప్పాడు? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? అనే విషయాలను నెటిజన్ల శోధిస్తున్నారు.

తాజాగా వేణుస్వామి అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అదిగో ఆ సినిమా.. ఇదిగో ఈ సినిమా అంటూ ప్రచారం జరగడమేకానీ సినిమాల్లో నటించేది మాత్రం ఎప్పుడు అనే విషయంలో బాలకృష్ణ కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అఖండ సినిమా షూటింగ్ జరిగే సమయంలో తాను బాలయ్యను కలిశానని, ఆయనతోపాటు ఆయన తనయుడు మోక్షజ్ఞను కూడా కలిసినట్లు వేణుస్వామి చెప్పారు.
మోక్షజ్ఞ జాతకం చూశారా? అని వేణుస్వామిని యాంకర్ ప్రశ్నించగా చూశానని బదులిచ్చారు. ఎలా ఉందని అడగ్గా.. అతని జీవితం బాగుందని, సినీరంగంలో ఆయన కెరీర్ ఇంకా బాగుందని చెప్పారు. కాకపోతే సినిమాల్లో అడుగు పెట్టడానికి మాత్రం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. సినిమాల్లో రాణిస్తాడని, రాజకీయాల జోలికి వెళ్లడన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications