Venu Swamy : జగన్ గురించి బాంబు పేల్చిన వేణు స్వామి.. గండం పొంచి ఉందటూ షాకింగ్ కామెంట్స్..!
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.

2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను ఓడించలేరని ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్య్వూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘటించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ... ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూంటే మీరు... మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణు స్వామిని ప్రశ్నిస్తారు.

ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతకరీత్య జగన్ మళ్లీ సీఎం అవుతారని.. చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణు స్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని.. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు.

అంటే మూడు వరుస ఎన్నికల్లో జగనే గెలుస్తారని వేణు స్వామి జోస్యం చెప్పారు. 17 సంవత్సరాల తరువాత జగన్‌కు కొన్ని గండాలున్నాయని ఈ ఇంటర్య్వూలో తెలిపారాయన. జగన్ ఎదుర్కొనే గండాల గురించి ఇప్పుడే మాట్లాడటం సరైంది కాదంటూ వేణు స్వామి వ్యాఖ్యనించారు.. ప్రస్తుతానికి అయితే జగన్ జాతకం అద్బుతంగా ఉందని.. ఆయన్ను ఢీ కొట్టే నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదని వేణు స్వామి వ్యాఖ్యనించారు. జగన్ మరో మూడు ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడంతో.. వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications