వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం నుంచి ఇలాంటి నోట్లా!: చూస్తే అవాక్కవాల్సిందే..

ఏటీఎం నుంచి 'ఫుల్ ఆఫ్ ఫన్' పేరుతో నకిలీ రూ.500 నోటు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు.

|
Google Oneindia TeluguNews

బొబ్బిలి: చాలావరకు ఏటీఎంలు 'నో క్యాష్' బోర్డులతో దర్శనమిస్తుండటంతో దేశవ్యాప్తంగా సామాన్యులంతా మళ్లీ కరెన్సీ కష్టాలను చవిచూస్తున్నారు. బ్యాంకులు సైతం బాదుడు మొదలుపెట్టడంతో సామాన్యులంతా నెత్తి నోరు బాదుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తికి వింత నోటు దర్శనమిచ్చింది. ఏటీఎం నుంచి 'ఫుల్ ఆఫ్ ఫన్' పేరుతో రూ.500 నోటు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. విజయనగరంకు చెందిన అంపావల్లి చిన్నారావుకు కరూర్ వైశ్యా బ్యాంకులో ఈ అనుభవం ఎదురైంది.

Atm dispensed a fake note in vizianagaram

ఏటీఎం నుంచి ఈ నకిలీ నోటు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నోటు మీద ఫుల్ ఆఫ్ ఫన్ తో పాటు మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది. దాంతో పాటు నోటుపై ఉన్న నంబర్లన్ని సున్నాలే కావడం గమనార్హం. నకిలీ నోట్లు సైతం ఏటీఎంల నుంచి రావడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Ampavalli Chinnarao, who is working as lineman in vizianagaram was got a fake Rs500 note from Karur Vysya bank on wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X