Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి; కారు ధ్వంసం.. కాల్పులు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు.

పద్మావతి యూనివర్సిటీ వద్ద పులివర్తి నానిపై దాడి
పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉండడంతో, అక్కడ భద్రతను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన పైన దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసం కాగా, నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

attack on tdp candidate pulivarthi nani in tirupati security personnal injured firing in air

గాల్లోకి కాల్పులు.. యూనివర్సిటీ ముందు ఆందోళన
పులివర్తి నాని పై దాడికి పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను చెదరగొట్టడం లో భాగంగా నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. తనపై దాడి జరగటంతో మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే పులివర్తి నాని బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నానిపై దాడి జరగడంతో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. పద్మావతి యూనివర్సిటీ ముందు ఆందోళన చేపట్టారు.

దాడికి పాల్పడిన వారి కారు ధ్వంసం
అంతేకాదు పులివర్తి నాని పై దాడి చేసిన వారు పద్మావతి యూనివర్సిటీ లోపల ఉంటారని భావించిన టిడిపి శ్రేణులు వారి కోసం గాలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఒక ఎరుపు రంగు హుండాయ్ కారు ఉండడంతో ఆ కారులో వైసీపీ జెండాలు, కండువాలు, మద్యం బాటిళ్లు కనిపించడంతో టీడీపీ నేతలు, దాడి చేసిన వారు ఉపయోగించిన కారుగా గుర్తించి ఆ కారును ధ్వంసం చేశారు.

పులివర్తి నానిపై దాడి చేయించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే అని ఆరోపణ
అసలు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతం వద్ద వైసీపీ కార్యకర్తలకు ఏం పని అని టిడిపి శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాని పై దాడి చేయించారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పులివర్తి నాని పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+