ఓ ప్రాణాన్ని కాపాడిన రాజమౌళి సినిమా: బాహుబలి చూపిస్తూ ఆపరేషన్
గుంటూరులోని తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది.
గుంటూరు: గుంటూరులోని తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంతో ఈ శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు చెప్పారు. గుంటూరుకు చెందిన వేశపోగు వినయ కుమారి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తోంది.

ఫిట్స్ రావటంతో ఆసుపత్రికి
ఈ మధ్య ఆమెకు పిట్స్ వచ్చాయి. దీంతో గుంటూరు తులసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరాలజీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని ఆపరేషన్ ద్వారా ఆ గడ్డ తొలగించాలని చెప్పారు.

ఆపరేషన్ జరుగుతున్నంత సేపు చేతులు, వేళ్లు కదపాలి
అయితే ఆమె ఆపరేషన్ జరుగుతున్నంతసేపు సహకరించాల్సి ఉంటుందని చేతులు వేళ్లు కదపాలని అందువల్ల మత్తు మందు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో ఆపరేషన్ అంటే భయం పోగొట్టేందుకు ఆమెకు ఇష్టమైన బాహుబలి 2 సినిమాను ఆపరేషన్ థియేటర్లో ప్రదర్శించారు.

బాహుబలి సినిమా చూపిస్తూ
బాహుబలి సినిమా చూస్తూ ఆ సినిమాలోను దండాలయ్యా... దండాలయ్యా పాటను పాడుతూ ఆమె డాక్టర్లకు సహకరించింది. తనకు సినిమా సరిగా కనిపించడం లేదని, దూరంగా ఉండటం వల్ల స్క్రీన్ సరిగా కనిపించడం లేదని, కాస్త దగ్గరకు పెట్టాలని కూడా డాక్టర్లను కోరింది.

సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్ వైరల్
ఇదేం సినిమా అని డాక్టర్లు అడగ్గా.. ఆ సినిమా పేరును ఉత్సాహంగా చెప్పింది. సుమారు గంటన్నర పాటు డాక్టర్లు శ్రమపడి ఆమె మెదడులో ఉన్న గడ్డను విజయవంతంగా తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications