బాలకృష్ణ అన్ స్టాపబుల్ అని తేల్చేసిన సీఎం చంద్రబాబు!
బాలకృష్ణ నట ప్రస్థానానికి నేటితో 50 సంవత్సరాలు. తెలుగు రాష్ట్రాన్ని తన సినిమాలతో ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడుగా సినీ ఇండస్ట్రీలో తనదైన రికార్డులు సృష్టించాడు. 1974 ఆగస్టు 30వ తేదీన సినిమాల్లోకి అరంగేట్రం చేసిన బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహిస్తోంది.
బాలయ్య 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యే గాను అటు సినిమాలలో తనదైన మార్క్ చూపించిన బాలకృష్ణ జరుపుకునే ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో సెప్టెంబర్ ఒకటవ తేదీన భారీ స్థాయిలో బాలయ్య 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నారు. 1974లో మొదలైన బాలయ్య సినీ ప్రస్థానం నేటికీ కొనసాగుతుంది.

బాలయ్యకు చంద్రబాబు విషెస్
సినిమా చరిత్రలో 50 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని నేటికి కూడా హీరోగానే బాలయ్య నటిస్తుండడం ఒక చరిత్ర. ఇటీవల కాలంలో బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా 100 కోట్ల మార్కును దాటింది అంటే బాలయ్య నటనా సామర్థ్యం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న బాలయ్య
ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు అని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య...ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారని కితాబిచ్చారు.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్ష
తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించాలని, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని బాలకృష్ణ ను ఉద్దేశించి చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications