ఏపీ, తెలంగాణాలకు బాలకృష్ణ భారీ విరాళం.. తెలుగు ప్రజలపై భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు రెండు రాష్ట్రాలలోనూ అనేక ప్రాంతాలలో వరద బీభత్యాన్ని సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా విజయవాడ ను వరదలు ముంచేశాయి.
రెండు తెలుగురాష్ట్రాల్లోనూ వరద బీభత్సం
బుడమేరు పొంగడం వల్ల విజయవాడలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలలోనూ పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులను, పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ,అధికార యంత్రాంగం.

వరదబాధితుల కోసం నేను సైతం అంటున్న బాలయ్య
ఇదిలా ఉంటే తాజాగా వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ కదిలింది. ఇప్పటికే అశ్విని దత్ ఏపీ ప్రభుత్వానికి 25 లక్షల రూపాయలు వరద సాయం ప్రకటించి, ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తే, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇక తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.
ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ విరాళం
ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ఇస్తున్నానని ప్రకటించారు. తెలుగు ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న బంధం విడదీయరానిదని, తెలుగు ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు సాయం అందించడం తన బాధ్యత అన్న బాలయ్య
తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయని, తెలుగు ప్రజలకు సాయం అందించడం తన బాధ్యత అని పేర్కొన్న బాలకృష్ణ అందుకే ఇరు రాష్ట్రాల ప్రజలకు నా వంతుగా చెరొక యాభై లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు నందమూరి బాలకృష్ణ.












Click it and Unblock the Notifications