పోటీకి సిద్ధం, కానీ: బాలకృష్ణ, బాబు వ్యూహం ఫలించేనా

తనను పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సి ఉందని చెప్పారు. అలాగే అభిమానుల కోసం నటిస్తూ.. వినోదం పంచాల్సి ఉందని చెప్పారు.
కాగా, బాలకృష్ణ అసెంబ్లీ నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య గత ఏడాది చెప్పారు. అప్పటి నుండి ఆయన పోటీ చేసే స్థానంపై చర్చతో పాటు ఉత్కంఠ కొనసాగుతోంది. గుడివాడ, పలమనేరు, హిందూపురం.. తదితర నియోజకవర్గాలు ఈ లిస్టులో ఉన్నాయి.
అయితే, బాలయ్య లోకసభకు పోటీ చేస్తే బావుంటుందని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారట. బాలయ్య అసెంబ్లీకి పోటీ చేస్తే కేవలం చుట్టుపక్కల నియోజకవర్గాల పైన మాత్రమే ప్రభావం ఉంటుందని, అదే లోకసభ నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం చుట్టు పక్కల జిల్లాలకు విస్తరిస్తోందని లెక్కలు వేసుకుంటున్నారు.
చంద్రబాబు కూడా బాలయ్యను లోకసభకు పంపించాలని చూస్తున్నారట. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే పార్టీలో రెండు పవర్ సెంటర్లు ఏర్పడుతాయని, అవి తనకు ఇబ్బందులు తీసుకు వస్తాయని, అందుకే ఆయనను లోకసభకు పంపించడమే మంచిదని భావిస్తున్నారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications