ఆ పార్టీకే మైనస్.. చంద్రబాబు అరెస్ట్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!!

టిడిపి అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆయన చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా తప్పు పట్టారు.

కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబు ని అరెస్ట్ చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఆదరాబాదరాగా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఇమేజ్ పెరిగిందని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేని ప్రజలు కూడా చంద్రబాబు అరెస్ట్ ను తప్పు పడుతున్నారని, వైసీపీ తీరుతో ప్రజలే తిరగబడతారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 bandi sanjay

చంద్రబాబు ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం వల్ల వైసీపీకి చాలా మైనస్ అవుతుందని, నేరం చేస్తే ఎవరినైనా అరెస్టు చేయాల్సిందేనని, అయితే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబు ని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టారు. దీని వల్ల నష్టం జరిగేది వైసీపీకి అని పేర్కొన్న ఆయన తెలుగుదేశం పార్టీకి దీనివల్ల మంచి మైలేజ్ దొరుకుతుందని పేర్కొన్నారు .

చంద్రబాబు ని అరెస్ట్ చేసిన తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. మాజీ సీఎంను అంత దారుణంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే తమపై ఏజెంట్లు అని ముద్ర వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు బండి సంజయ్. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు.

 bandi sanjay

అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశం నిర్వహించిన జి20 సమావేశాల సమయంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులకు సమయం కుదిరిందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్ అని ముద్ర వేసే దురలవాటు వైసీపీ నేతలకు ఉందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ పై తప్పు, ఒప్పు అని చెప్పకుండా డిప్లమాటిక్ గా మాట్లాడితే బండి సంజయ్ మాత్రం బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+