Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ ..గట్టిగానే కౌంటర్ ఇచ్చాడుగా..!

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.

ఫలితాల సమయంలో తనదైనశైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.

bandla ganesh indirect comments on pawan kalyan

అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేష్ తీరు మారినట్టే కనిపిస్తుంది. నా సినిమాలకు కోసం నేను ఎవరినైనా పొగుడుతానని .. అందరి హీరోలు నాకు సమానమే అని ఆయన చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో జగన్‌గారి పాలన బాగుందని..నాకు తెలిసిన వ్యక్తికి వైద్యసాయం చేశారని.. ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడుతో సమానమని చెప్పి జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సమయంలో బండ్ల గణేష్ సీఎం జగన్‌పై విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న బండ్ల గణేష్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ఫొటోలో బుక్ చదువుతూ కనిపించారంటే.. మీకు పుస్తకాలు చదవడం అంటే అంత ఇష్టమా అనే ప్రశ్న ఎదురైంది.

bandla ganesh indirect comments on pawan kalyan

దీనికి బండ్ల గణేష్ సమాధానం చెబుతూ..ప్రతిరోజు నేను గంటకు పైగా పుస్తకాలు చదువుతానని..అందులో ఉన్నటువంటి మంచి పాయింట్స్ నేను అండర్లైన్ చేస్తూ ఉంటానని ..ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉందని బండ్ల గణేష్‌‌ తెలిపారు. ఈ సమయంలో ఆయన నేను రోజుకి గంట మాత్రమే పుస్తకాలు చదువుతానని..అంతే కానీ లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివాను అంటూ గొప్పలు చెప్పుకోనని బండ్ల గణేష్ తెలిపారు.

గతంలో పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ..లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి కౌంటర్‌గానే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే చేశారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై బండ్ల గణేష్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+