బ్యాంక్ ఉద్యోగులపై కేంద్రానికి సాయిరెడ్డి కీలక సలహా..! 5 రోజుల డిమాండ్ పై..!

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు తమకు ఐదు రోజుల పని విధానం అమలుచేయాలని కోరుతూ ఇవాళ మెరుపు సమ్మెకు దిగారు. ఇవాళ ఒక్కరోజు పాటు బ్యాంక్ సేవల్ని నిలిపేసి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఐదు రోజుల పని విధానానికి కేంద్రం అంగీకరించకపోవడంతో వీరంతా ఇలా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే ఇటు బ్యాంక్ ఉద్యోగులకూ, అటు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఏం చేయాలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇవాళ వెల్లడించారు.

ఐదు రోజుల పని విధానం కోరుతూ ఇవాళ బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఛార్టెట్ అకౌంటెంట్ కూడా అయిన విజయసాయిరెడ్డి స్పందించారు. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన ఓ సలహా ఇచ్చారు. ఇది అమలు చేస్తే అటు బ్యాంక్ కస్టమర్లతో పాటు ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదని తేల్చిచెప్పేశారు. కాబట్టి ఈ సూచన అమలు చేయాలని ఆయన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.

Bank 5-Day Work Demand Vijayasai Reddy Proposes Rotational Roster to FM Nirmala sitharaman

కొంత మంది బ్యాంక్ ఉద్యోగులు ఇవాళ సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారికి బీఎఫ్ఎస్ఐ పర్యావరణ వ్యవస్థ (ఆర్బీఐ, సెబీ, ఇన్సూరెన్స్) తరహాలో వారంలో అన్ని రోజులూ సంస్థను తెరిచే ఉంచాలని, అయితే ఉద్యోగులకు మాత్రం రొటేషన్ రోస్టర్ ను అమలు చేయాలని విజయసాయిరెడ్డి ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించారు. రొటేషనల్ రోస్టర్ వ్యవస్ధలో శనివారం, ఆదివారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయి. అయితే ఉద్యోగులకు మాత్రం అందరికీ ఈ రెండు రోజులు సెలవు ఇవ్వకుండా రొటేషన్ విధానంలో కొందరి చొప్పున ఇలా వారాంతపు సెలవులు కల్పిస్తారు. ఈ రొటేషన్ ద్వారా అందరికీ ఇలా ర్యాండమ్ గా వారాంతపు సెలవులు దొరుకుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+