బెదిరిస్తున్న బంగాళాఖాతం.. నేడు, రేపు మళ్ళీ వర్ష బీభత్సం!

వర్షాకాలం ముగిసినప్పటికీ, ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మొన్న మొంథా తుఫాను చేసిన తీరని నష్టం నుండి ఇంకా కోలుకోక ముందే కోస్తా తీరానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనం... మళ్ళీ ఏపీలో వర్షాలు
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే నేడు కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాయలసీమలోని పలు జిల్లాల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Bay of Bengal warning Rains in ap again today and tomorrow in these districts

నేడు ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు , బాపట్ల, కర్నూలు, తిరుపతి, కడప జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక మిగతా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

రేపు ఈ జిల్లాలలో వర్షాలు, అధికారుల సూచనలు
రేపు నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడి ఉండకూడదని సూచించారు.ఇక వర్షాలు పడుతున్న సమయంలో రైతులు తమ పంట విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణన లోకి తీసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు.

నిన్న ఏపీలో వర్షాలు ఇలా
ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో 61.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నంద్యాల జిల్లా నందికొట్కూరులో 51.8 మిల్లీమీటర్లు , బొల్లవరం లో 43.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. కాగా మంగళవారం నాడు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుశాయని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+