ప్రతిరోజు బీరు తాగడం చాలా మంచిది: అమెరికా సర్వే
మద్యం సేవించడాన్ని చాలామంది తప్పుగా భావిస్తారు. అది మంచి అలవాటు కాదని, అందుకు దూరంగా ఉండాలంటూ పెద్దలు పిల్లల్ని మందలిస్తుంటారు. యువత ఎక్కువగా బీరు వైపు మొగ్గుచూపుతుంటుంది. చల్లటి బీరు గొంతులో నుంచి ఒక్కో చుక్క కిందకు దిగుతుంటే ఆ స్వర్గమే వేరబ్బా అనుకుంటుంటారు చాలామంది. బీరు సీసా కనపడితే చాలు ఎప్పుడు తాగేద్దామా? అనుకుంటూ దానివంక ఆశగా చూస్తుంటారు. అయితే ఇటువంటివారికి మాంచి జోష్ ఇచ్చే వార్తను ఓ సర్వే వెల్లడించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ చేసిన సర్వేలో బీరు
బీరు ప్రతిరోజు తాగినా మంచిదే అన్నట్లుగా తెలిపారు. 7వేల మందిపై అధ్యయనం చేశారు. సాధారణంగా గుండె సమస్యలు ఉన్నవారు బీరును రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తేలింది. గుండెపోటు వచ్చే అవకాశాన్ని బీరు తగ్గిస్తుందని సర్వేలో తేలింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లద్వారా అనేకరకాల వ్యాధులను తగ్గించొచ్చని తేలింది. విటమిన్ బి, ప్రొటీన్లు ఉంటాయని, వైన్ తో పోలిస్తే బీరులోనే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని సర్వేలో తేలింది.

ఎముకలు బలంగా మారడానికి పాలలో ఎటువంటి పోషకాలు ఉంటాయో అవే పోషకాలు బీరులో కూడా ఉంటాయని తెలిపింది. దంతాల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని తేలింది. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే మందులు బీరులో ఉంటాయి. నోటిలో ఏదైనా ఇన్ ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియా ఉంటే అవి కూడా పారిపోతాయి. వారానికి 14 గ్లాసుల బీరు తాగితే టైప్-2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే బీరు బాబులు మరీ ఎక్కువగా తాగొద్దని, లిమిట్ లో ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications