పెళ్లికి ముందు పార్ట్ నర్ ను అడగాల్సిన ప్రశ్నలు

పెళ్లంటే నూరేళ్ళ పంట. ఒకసారి వివాహబంధం లోకి అడుగు పెట్టిన తరువాత అంతా సక్రమంగా సాగాలని భార్యాభర్తలతోపాటు వారి తల్లిదండ్రులు, బంధువులు కోరుకుంటారు. అలా సాగాలి అంటే మన ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించే పార్ట్ నర్ ఉండటం కూడా ముఖ్యం. ఎదుటివారి మనసును అంచనా వేసి వారికేదైతే ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకోగలిగే ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యం.

పెళ్లి అంటే.. ఇద్దరు మనుషులు.. రెండు మనసులు ఒకటవడంకాదు.. రెండు కుటంబాల బాధ్యతను కూడా మోయాల్సి ఉంటుంది. ఇరువైపులా వంశ గౌరవాన్ని వృద్ధి చేయాల్సి ఉంటుంది. చివరివరకు ఒకర్నొకరు తోడుగా నిలవాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా ప్రస్తుత తరంలో ఆ బంధాలు ఎక్కువకాలం నిలవడంలేదు. చిన్న కారణానికే విడిపోతున్నారు.

partners

అలాగ జరక్కుండా ఉండాలి.. అంటే వివాహానికి ముందే అన్ని విషయాలను పార్ట్ నర్ తో స్పష్టంగా మాట్లాడుకోవాలి. తన గురించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. పెళ్లికి ముందే ఇద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ బాధ్యత ఇద్దరిపై ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటే చిన్న చిన్న వివాదాలు రేకెత్తినా వెంటనే సర్దుకుంటాయి. బంధం నిలబడాలి అంటే పునాది పటిష్ఠంగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులతోపాటు పొదుపు గురించి, లేదంటే డబ్బు ఖర్చు గురించి మొత్తం విషయాలు మాట్లాడుకోవాలి.

భవిష్యత్ లో కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఇద్దరూ ముందే మాట్లాడుకోవాలి. కెరీర్ కి సంబంధించి, భవిష్యత్ లక్ష్యాల గురించి ఒకర్నొకరు పంచుకోవాలి. ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఎలా అమలు చేయాలి? తదితర విషయాలను చర్చించుకోవాలి. పెళ్లికి ముందు బ్రేకప్స్ ఉంటే ముందే చెప్పుకోవాలి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? వ్యాపకాలేంటి? హాబీల గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతేకాదు.. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మాట్లాడుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+