రివర్స్: ఆదినారాయణరెడ్డి చంద్రబాబు ప్లాన్ లీక్ చేశారా, జగన్‌పై తొందరపడ్డారా?
అమరావతి: వైసీపీ ఎంపీల కంటే నెల రోజుల ముందే తమ పార్టీ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత అది తన వ్యక్తిగత అభిప్రాయమని యూటర్న్ తీసుకోవడం టీడీపీలోను, రాజకీయ వర్గాల్లోను కలకలం రేపుతోంది.
చదవండి: విజయసాయిరెడ్డి ఎఫెక్ట్: షాకింగ్ మెలిక, రాజీనామాపై మళ్లీ దొరికిపోయిన జగన్
గురువారం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నదా? మార్చి 5 వరకు కేంద్రానికి తాము డెడ్ లైన్ ఇస్తామని టీడీపీ గతంలోనే చెప్పినందున.. ఆదినారాయణ చెప్పినట్లు ఆ రోజు కేంద్రమంత్రులు సుజనా, అశోక్‌లతో రాజీనామా చేయించాలని బాబు అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ సాగుతోంది.
చదవండి: బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం

ఆదినారాయణ రెడ్డి లీక్ చేశారా?
బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటి దాకా వైసీపీని కార్నర్ చేసుకుంటూ వచ్చిన టిడిపి అలాగే దూకుడుగా ముందుకు వెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించింది. అదే సమయంలో సమయం, సందర్భాన్ని బట్టి కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలనే కీలక నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారా? దానిని ఆదినారాయణ లీక్ చేశారా అనే చర్చ సాగుతోంది.
Recommended Video


చంద్రబాబు ఆగ్రహం వల్ల
ఆదినారాయణ రెడ్డి ఆరు గంటలకు ఓ ప్రకటన, ఏడు గంటలకు మరో ప్రకటన చేశారు. ఆయన ఆవేశపు వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన ఆ వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయంగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటే ఆది తొందరపడ్డారా అనే చర్చ కూడా సాగుతోంది.

జగన్ సవాల్‌కు ప్రతిసవాల్ విసరాలని తొందరపడ్డారా
టీడీపీ సమన్వయ కమిటీలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ... అంతకుముందే జగన్ తమ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని, కలిసి రావాలని టీడీపీకి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు ప్రతి సవాల్ విసరాలనే అత్యుత్సాహంలో మాట్లాడారా అనే చర్చ కూడా సాగుతోంది.

జగన్‌పై తన మార్క్ దూకుడు
ఆదినారాయణ రెడ్డి ఆవేశమో, అత్యుత్సాహమో.. ఏదైనా గంటలోపు ఆయన తన ప్రకటనను సవరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పటి నుంచి జగన్ పైన తన దూకుడైన మాటలతో విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా గురువారం కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications