బంగారు ఆభరణాలను ఇలా శుభ్రం చేస్తే ధగధగా మెరుస్తాయి!!
బంగారు ఆభరణాలు అంటే స్త్రీలకు ఎనలేని మక్కువ. బంగారంతో మహిళలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ చిన్న సందర్భం అయినా బంగారాన్ని కొనుగోలు చేసే మహిళలు, ఆ బంగారు ఆభరణాలను ఎంతో భద్రంగా దాచుకుంటారు. అయితే కొంతకాలం తర్వాత బంగారం ఆభరణాల మెరుపు తగ్గిపోవడమే కాకుండా, మనం ఉపయోగించడం వల్ల వాటిలో మురికి చేరుకుని డల్ గా తయారవుతాయి.
చాలామంది బంగారు ఆభరణాలను మెరుగు పెట్టించుకోవడం కోసం బంగారు దుకాణాలను ఆశ్రయిస్తారు. అయితే ఇంట్లోనే బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకోవచ్చని, చిన్న చిన్న టిప్స్ తో మన బంగారం మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చని చెబుతున్నారు. బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లు, సబ్బు మిశ్రమం ఉంటే సరిపోతుంది.

ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ ఉన్నా బంగారాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే డిష్ వాష్ లిక్విడ్ ను లేదా సబ్బును గోరువెచ్చని నీళ్లలో వేసి ఆపై అందులో బంగారు ఆభరణాలను వేయాలి. 15 నిమిషాల పాటు వీటిని నీళ్ళల్లో నానబెట్టి, ఆపై మెత్తని కుచ్చులు ఉన్న బ్రష్ తో నిదానంగా క్లీన్ చేసి, ఒక మెత్తని క్లాత్ తో శుభ్రంగా తుడిస్తే బంగారు ఆభరణాలు మురికి తొలగిపోయి మళ్లీ మెరుపును సొంతం చేసుకుంటాయి.
బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ ను కూడా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కొంచెం టూత్ పేస్ట్ ను తీసుకొని బంగారు ఆభరణాలకు రాసి, నిదానంగా మెత్తని బ్రష్ తో రుద్దడం వల్ల బంగారు ఆభరణాలు కాంతిని కోల్పోకుండా ఉంటాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాలపాటు ఉంచి, మెత్తని గుడ్డతో శుభ్రంగా తుడిస్తే బంగారు ఆభరణాలు మెరుపును సొంతం చేసుకుంటాయి.
బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి అమ్మోనియా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అమోనియా ద్రావణంలో బంగారు ఆభరణాలను వేసి నిమిషం నిమిషం తర్వాత టూత్ బ్రష్ సహాయంతో నిదానంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు అవి మళ్ళీ కాంతివంతంగా మారతాయి.












Click it and Unblock the Notifications