జగన్! వారికి నేనున్నా: బ్రహ్మానందరెడ్డి, అఖిల కంటతడి, చూపిస్తా: చక్రపాణి రెడ్డి హెచ్చరిక
టిడిపి నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
నంద్యాల: టిడిపి నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
దీంతో ఆయన సోదరి, మంత్రి అఖిలప్రియ, మరో సోదరి మౌనిక కంటతడి పెట్టారు. బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేసిన సమయంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

నా సోదరి అఖిలప్రియకు ఎవరూ లేరనుకోవద్దు: బ్రహ్మానంద రెడ్డి
భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎవరూ లేరని అనుకోవద్దని భూమా బ్రహ్మానంద రెడ్డి వైసిపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నా చెల్లెళ్లు, తమ్ముడికి నేను అండగా ఉన్నానని చెప్పారు. ఈ సమయంలో అఖిలప్రియ, మౌనికలు కంటతడి పెట్టారు.
Recommended Video


చంద్రబాబును దులిపేసిన చక్రపాణి రెడ్డి
టిడిపికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి బుధవారం సీఎం చంద్రబాబు దుమ్ము దులిపారు. టిడిపిలో తనను తీవ్రంగా అవమానించారని ధ్వజమెత్తారు. తాను టిడిపితో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపించినట్లు చెప్పారు.

అఖిలప్రియ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
మంత్రి అఖిలప్రియ సహా టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని చక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చీమకు కూడా తమ సోదరుడు హానీ చేయడన్నారు.

మేమేంటో చూపిస్తాం
నంద్యాల ఉప ఎన్నికల ద్వారా మేమేంటో చూపిస్తామని చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మోహన్ రెడ్డిని గెలిపించి, జగన్‌కు దీనిని కానుకగా ఇస్తామని చెప్పారు. టిడిపిలో తనను తీవ్రంగా అవమానించారన్నారు. పార్టీని భుజాలపై పెట్టుకొని మోశానని చెప్పారు.

రేపు వైసిపిలో చేరుతున్నా
రేపు నంద్యాల బహిరంగ సభలో వైయస్ జగన్ సమక్షంలో తాను వైసిపిలో చేరుతానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. సాయంత్రంలోగా జగన్‌ను కలుస్తానని, ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం నిబద్దతతో పని చేశారని చెప్పారు. అలాగే రెండేళ్లు టిడిపి బలోపేతం కోసం పని చేశానని చెప్పారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు
డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా తమ పైన విమర్శలు చేస్తున్నారని చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. రాజీనామాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని, దమ్ముంటే అందరం కలిసి రాజీనామా చేద్దాం రండి అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications