భువనేశ్వరి పుట్టినరోజు: చంద్రబాబు ప్రేమపూర్వక పోస్ట్, భువనమ్మ స్వీట్ రిప్లై; అమ్మకు లోకేష్ విషెస్!!

ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు నేడు. గతంలో రాజకీయాలపైన మాట్లాడని, రాజకీయాలకు దూరంగా ఉన్న నారా భువనేశ్వరి గత ప్రభుత్వ పాలనలో ఏపీలో జరిగిన దారుణాలపైన రాజకీయంగా స్పందించారు. రాజధాని అమరావతి రైతులకు అండగా మేమున్నామని చెప్పారు.

భువనేశ్వరి పుట్టినరోజున చంద్రబాబు స్పెషల్ విషెస్
చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో నిజం గెలవాలి అంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కార్యకర్తలను ఓదార్చారు. వైసీపీ ప్రభుత్వ అమానవీయ చర్యలను ప్రశ్నించారు. గత ఎన్నికలలోను చంద్రబాబుకు అండగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఇక ఈ క్రమంలో నేడు నారా భువనేశ్వరి పుట్టినరోజున చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు.

Bhuvaneswari birthday Chandrababu loving post Bhuvaneswari sweet reply Lokesh Wishes his Mom

నా సర్వస్వం నువ్వే... చంద్రబాబు ట్వీట్
ఎక్స్ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాకు ఎల్లప్పుడూ మద్దతుగా, పెద్ద సపోర్ట్ లా ఉంటావు. ఆఖరికి చీకటి రోజులలో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నావు. ప్రజలకు సేవ చేయాలనే నా అభిరుచుని గమనించి వందకు వందశాతం సహకారం ఇచ్చావు. జన్మదిన శుభాకాంక్షలు భువనేశ్వరి.. నా సర్వస్వం నువ్వే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీ పట్ల మీ భక్తికి గర్వపడుతున్నా... భువనేశ్వరి రిప్లై
ఇక చంద్రబాబు ట్వీట్ కు స్పందించిన భువనేశ్వరి కూడా ధన్యవాదాలు అండి.. నేను ప్రతిరోజు మెరుగ్గా ఉండడానికి మీరే నాకు ప్రేరణ అంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నానని మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు మీరేనా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు భువనేశ్వరి.

అమ్మా .. నువ్వే నాకు స్ఫూర్తి: లోకేష్ విషెస్
ఇదిలా ఉంటే ఏపీ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ... మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం. ప్రజలకు సేవ చేయడం, వ్యాపారంలో నైపుణ్యం, న్యాయం కోసం పోరాడటం పట్ల మీరు చూపిన అంకితభావం నాకు స్ఫూర్తినిచ్చాయన్నారు .

తల్లి చెయ్యి పట్టుకొని నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన లోకేష్
మీరు ప్రతిరోజు మీ తెలివితేటలతో, దయతోను మా జీవితాలను ప్రకాశవంతం చేస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలమ్మా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు తన తల్లి చెయ్యి పట్టుకొని నడుస్తున్న ఫోటోను లోకేష్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. తన తల్లి పట్ల ప్రేమను లోకేష్ తన పోస్ట్ ద్వారా చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+