చంద్రబాబు- మిట్టల్ భేటీ..! అనకాపల్లిలో ముహుర్తం ఫిక్స్..!
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. అక్కడ స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ పారిశ్రామిక వేత్తలతో జరుగుతున్న భేటీలో భాగంగా మిట్టల్ తోనూ సమావేశమై పలు అంశాలు చర్చించారు. ఇందులో భాగంగా వీరిద్దరూ కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలోని అనకాపల్లికి మంచి రోజులు రాబోతున్నాయి.
అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయి అనకాపల్లిలో నిర్మించనున్న భారీ స్టీల్ ప్లాంట్ పై చర్చించారు. దావోస్ లోని ఏపీ లాంజ్ లో జరిగిన ఈ భేటీలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్ధ సీఈవో ఆదిత్య మిట్టల్, మంత్రులు లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై వీరు చర్చించారు. తొలి దశలోనే దాదాపు రూ. 60వేల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వివిధ దశల్లో ఉన్న అనుమతులపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలో అధికారులతో సీఎం సమీక్షించారు.
అనంతరం ఫిబ్రవరి 15లోగా అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 15 తరవాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, ఇతర సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని స్పష్టం చేశారు.

అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అవసరమైన అన్ని అనుమతుల సాధించాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్ లకు సీఎం సూచన చేశారు. ప్లాంట్ నిర్మాణం విషయంలో మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు గురించి లక్ష్మీ మిట్టల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications