AB Venkateswara Rao: రిటైర్మెంట్ వేళ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. !

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో వైసీపీ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఓసారి సస్పెండ్ చేయడంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరటపొందిన ఆయన్ను రెండోసారి బిజినెస్ రూల్స్ పేరుతో సస్పెండ్ చేశారు. అయితే ఇలా రెండోసారి సస్పెన్షన్ చేయడం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ను హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వానికి అక్కడా ఊరరట దక్కలేదు.

ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ )ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఈ తీర్పును ప్రకటించింది. ఇందులో క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు సమర్దించింది. రెండోసారి ఏబీని సస్పెండ్ చేయడం చెల్లదని తీర్పు ఇచ్చింది. దీంతో రిటైర్మెంట్ వేళ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించినట్లయింది.

big relief to former ap intel chief ab venkateswara rao as hc refused jagan regime appeal

గతంలో ఏబీపై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తనకు పెండింగ్ ఉన్న జీత భత్యాలు, పోస్టింగ్ కోసం ఏబీ ఎదురుచూస్తున్న సమయంలో ఆయనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేసారు. దీన్ని క్యాట్ తోసిపుచ్చింది. ఇప్పుడు క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో రేపు రిటైర్ అవుతున్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో ఆయనకు యథావిధిగా రిటైర్మెంట్ ప్రయోజనాలు లభించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+