నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బిగ్ షాక్!!
భారతదేశంలో ఇటీవల కాలంలో నెట్‌ఫ్లిక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. నెట్‌ఫ్లిక్స్ లో అనేక వెబ్ సిరీస్ కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో డిష్ కనెక్షన్, లేదా కేబుల్ కనెక్షన్ ఏ విధంగా అయితే ఉండేదో, ప్రస్తుతం అలా నెట్‌ఫ్లిక్స్ వినియోగం తయారయింది. అయితే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఒకరైతే దానిని మొత్తం ఐదుగురు వినియోగదారులు వినియోగించుకోవచ్చు.
అయితే ఈ ప్రక్రియ వల్ల నెట్‌ఫ్లిక్స్ ఆదాయానికి గండి పడుతుంది. దీంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. భారతదేశంలో ఇది చాలా పాపులర్ గా మారింది. నెట్‌ఫ్లిక్స్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఒక సబ్స్క్రిప్షన్ తో ఐదుగురు తమ ఖాతాలతో నెట్‌ఫ్లిక్స్ ను చూసే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది.

ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ఖాతాను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఖాతాదారులు వారి ఇంటి నుండి కాకుండా, బయట ఎక్కడినుండైనా ఎవరైనా ఇతరులు వారి ఖాతాలను ఉపయోగిస్తే వారు తప్పనిసరిగా దీనికోసం డబ్బులు చెల్లించాలి. ఇది ఇండియాలో వర్తిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ నిలుపుదల చేయాలనే ఈ నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకోలేదు. గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ సర్వీస్ నిలుపుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాక్ ఇస్తూ కుటుంబ సభ్యులకు తప్ప, ఇతరులు ఎవరైనా వినియోగిస్తే తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ అమౌంట్ చెల్లించవలసి ఉంటుందని పేర్కొంది.
నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న చందాదారుల కుటుంబ సభ్యులు మాత్రమే సేవలను వినియోగించుకోవాలని వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో అయినా, ప్రయాణాలలో ఉన్నా, ఏ సమయంలోనైనా దీనిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ప్రొఫైల్ బదిలీ, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైసెస్ వంటి ఫీచర్లతో కొత్త ఫీచర్లతో ఓటిటీ ప్రయోజనాలను పొందవచ్చని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.












Click it and Unblock the Notifications