పవన్ కుమారుడు అకీరాకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్..! ఆ మూవీ బ్యాన్..!

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ (pawan kalyan) పెద్ద కుమారుడు అకీరా నందన్ (akira nandan) కు ఇవాళ భారీ ఊరట లభించింది. అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ లో అతనికి అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. తనపై రూపొందించిన ఓ ఏఐ సినిమాను అడ్డుకోవాలని కోరుతూ అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఆ సినిమా విడుదల కాకుండా నిషేధం విధించింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ అనుమతి లేకుండా తన ముఖం, వాయిస్ మార్ఫింగ్ చేసి ఏఐ సాయంతో ఓ సినిమా తీసారు. దానికి ఏఐ లవ్ స్టోరీ అనే పేరు కూడా పెట్టారు. తనకు సంబంధం లేకుండా తీసిన ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ పవన్ కుమారుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సినిమాపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు పవన్ కుమారుడు మరో అంశంపైనా పిటిషన్ దాఖలు చేశారు.

Big Win for pawan kalyan s son Akira Nandan Delhi High Court bans Release of AI Love Story

ఈ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్, ఎక్స్ లో తన పేరుతో ఓపెన్ చేసిన ఫేక్ పేజీల్ని సైతం మూసేసేలా ఆదేశాలు ఇవ్వాలని అకీరా నందన్ హైకోర్టును కోరారు. దీనిపైనా స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా అకీరా అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలు, స్వరం, క్యారెక్టర్ ను వాడి ఎలాంటి ఏఐ, డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఏఐ లవ్ స్టోరీ సినిమాను ఫేస్ బుక్ సహా సోషల్ మీడియాలో పెట్టకుండా కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా యూట్యూబ్ లో విడుదల కావడం, లక్షల మంది చూసేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+