• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలోకి రాయపాటి..క‌న్నాకు షాక్ : చ‌ంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్‌: పోల‌వ‌రం ఫైళ్లు ఇక క్లోజ్ అవుతాయా

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ వీడి బీజేపీలో చేరనున్న రాయ‌పాటి ! || Rayapati Samba Siva Rao Ready To Join In BJP Shortly

సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త..టీడీపీ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బీజేపీలోకి వెళ్ల‌టానికి రంగం సిద్ద‌మైంది. నేరుగా బీజేపీ అగ్ర‌నేత రాం మాధ‌వ్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు. బీజేపీలో రావాల‌ని ఆహ్వానించారు. దీని పైన రాయ‌పాటి టీడీపీ అధి నేత చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. త‌న‌కున్న ఇబ్బందులను వివ‌రించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ఇచ్చిన మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పైన విచార‌ణ‌..రీ టెండ‌రింగ్ పైన ఆలోచ‌న చేస్తున్న స‌మ‌యంలోనే ఇటు వైపు ఈ ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. రేపో..మాపో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీజేపీలో చేర‌టం ఇక లాంఛ‌న‌మే. ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నాకు షాక్ ఇచ్చేలా రాం మాధ‌వ్ రాయ‌పాటి నివాసా నికి వెళ్లి మ‌రీ ఆహ్వానించ‌టం ఇప్పుడు కొత్త రాజ‌కీయాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

బీజేపీలోకి రాయపాటి సాంబ‌శివ‌రావు..

బీజేపీలోకి రాయపాటి సాంబ‌శివ‌రావు..

సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ..టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ద మైంది. ఏపీలో టీడీపీ ఓడిన త‌రువాత పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు న‌లుగురు బీజేపీలో చేరారు. దీని పైనా టీడీపీ అధినేత పెద్ద‌గా స్పందించ‌లేదు. దీంతో..మిగిలిన నేత‌లు త‌మ స‌మ‌స్య‌లు..భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ పార్ల‌మెంటేరీయ‌న్..టీడీపీ ఎంపీగా ప‌ని చేసిన రాయ‌పాటి సాంబ‌శివ రావు బీజేపీలో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. ఆయ‌న లాంఛ‌నంగా చేర‌ట‌మే మిగిలింది. దీనికి సంబంధించి న మంత‌నాలు పూర్త‌య్యాయి. రెండు మూడు రోజుల్లో రాయ‌పాటి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నట్లు స‌మాచారం. రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఉన్న అనుచ ర వ‌ర్గం మొత్తంగా బీజేపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని పైన రాయ‌పాటి ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

చంద్ర‌బాబుకు వివ‌ర‌ణ‌..గ్రీన్ సిగ్న‌ల్‌..

చంద్ర‌బాబుకు వివ‌ర‌ణ‌..గ్రీన్ సిగ్న‌ల్‌..

బీజేపీ నుండి ఆహ్వానం రాగానే రాయ‌పాటి తుది నిర్ణ‌యం చెప్ప‌క‌పోయినా సానుకూలంగా స్పందించారు. ఆ వెంట‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. తాను ఆరోగ్య ప‌రంగానే కాకుండా ఆర్దికంగా ఎదుర్కొంటున్న ఇ బ్బందుల‌ను వివ‌రించారు. ఢిల్లీలో త‌న నివాసానికి సంబంధించిన స‌మ‌స్య కూడా ఎదుర్కొంటున్న విష‌యాన్ని చంద్ర బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇక పోల‌వ‌రం పైన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నిపుణుల క‌మిటీ వేయ‌టం..రివ‌ర్స్ టెండ‌రింగ్ దిశ‌గా అడుగులు వేస్తున్న క్ర‌మంలో మ‌రింత‌గా ఆర్దికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని రాయ‌పాటి అనుచ‌రులు త‌మ నేత గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..బీజేపీ అగ్ర‌నేత గుంటూరులో స‌మావేశానికి వ‌చ్చిన స‌మ‌యంలో స్వ‌యంగా త‌న నివాసానికి వ‌చ్చి బీజేపీలోకి ఆహ్వానించార‌ని..టీడీపీ వీడుతున్నాన‌ని చంద్ర‌బాబుకు చెప్ప‌గా..ఆయ‌న మీ ఇబ్బందులు మీకున్నాయి..ఆలోచించి నిర్ణ‌యం తీసుకోండంటూ సూచించిన‌ట్లు స‌మాచారం. దీంతో..ఇక‌, రాయ‌పాటి టీడీపీ వీడి బీజేపీలో చేరటం ఖాయ‌మైంది.

క‌న్నాకు షాక్ ఇచ్చేలా.. పోల‌వ‌రం క‌ధ ఏమ‌వుతుంది..

క‌న్నాకు షాక్ ఇచ్చేలా.. పోల‌వ‌రం క‌ధ ఏమ‌వుతుంది..

ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క అంశం పైన చ‌ర్చ సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌.. రాయ‌పా టి సాంబ‌శివ‌రావు మ‌ధ్య ఎంతో కాలంగా రాజ‌కీయ వైరుధ్యం ఉంది. ఇప్పుడు బీజేపీలోకి రాయ‌పాటి రావ‌టం పైన క‌న్నా కు అభ్యంత‌రం లేక‌పోయినా..స్వ‌యంగా రాం మాధ‌వ్ ఆయ‌న నివాసానికి వెళ్లి ఆహ్వానించ‌టం పైనే చ‌ర్చ సాగుతోంది. ఇంత‌గా రాయపాటికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం క‌న్నాకు ఇబ్బందిక‌ర‌మే. ఇదే స‌మ‌యంలో ఇక‌..రాయ‌పాటి బీజేపీలోకి చేర టం ద్వారా పోల‌వ‌రం వ్య‌వ‌హారంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుందా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసినా..కేంద్రం రీఎంబ‌ర్స్ చేస్తోంది. దీంతో.. రాష్ట్ర ప్ర‌భు త్వం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా..కేంద్రం అనుమ‌తితోనే చేయాల్సి ఉంటుంది. దీంతో..రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా పోల‌వ‌రం వ్య‌వ‌హారంలో సేఫ్‌గా ఉంటారా అనే చ‌ర్చ ఇప్పుడు వైసీపీలో మొద‌లైంది.

English summary
TDP ex Mp and senior politician Rayapati Samba Siva Rao ready to join in BJP shortly. BJP key leader Ram Madhav discussed with Rayapati and invited him in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X