జగన్ అరెస్టు ఫిక్స్..! డేట్ మాత్రం..! తేల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే ..!
ఏపీ మద్యం కుంభకోణంలో సీఐడీ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు అవుతారన్న ప్రచారాన్ని కూటమి నేతలు తెరపైకి తెస్తున్నారు. అయితే సిట్ మాత్రం దీనిపై నోరు విప్పట్లేదు. అయినా జగన్ అరెస్టు చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు తనను ఓడించినందుకు రాష్ట్రం అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ తానే అధికారంలోకి వస్తానన్న భ్రమలో జగన్ ఉన్నారని నల్లమిల్లి తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావ అని, అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు లిక్కర్ స్కాంలో జగన్ అరెస్టుపైనా ఆయన స్పందించారు.

లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని, అయితే ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ మాత్రం చెప్పలేమని నల్లమిల్లి వెల్లడించారు. అరెస్ట్ మాత్రం ఖాయమన్నారు. లిక్కర్ స్కాంలో నిందితులు బిగ్‌బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి ఆధారంగా జగన్ ను అరెస్టు చేయడం ఖాయమని నల్లమిల్లి వెల్లడించారు. గతంలో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్టు చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications