Hyderabad Capital: వైసీపీ హైదరాబాద్ రాజధాని ప్లాన్ వెనుక ఏముంది?

ఏపీ విభజన సందర్బంగా కేంద్రం రెండు రాష్ట్రాల్ని విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడం, అప్పటికే రాజధాని అయిన హైదరాబాద్ ను అందరూ వాడుకుంటున్న కారణంగా ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు ఉంటుందని ప్రకటించింది. దీంతో రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణతో పాటు విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని స్వాగతించాయి. అయితే పదేళ్లు ముగిసిపోవడంతో ఇప్పుడు తిరిగి దాన్ని కొనసాగించాలన్న డిమాండ్ ను వైసీపీ తెరపైకి తెస్తోంది.

తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విశాఖ రాజధాని పూర్తయ్యే వరకూ అంటే కనీసం రెండేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామంటూ బాంబుపేల్చారు. దీనిపై మిశ్రమ స్పందన రావడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి బొత్సతో రాజధానిపై తేల్చాల్సింది కేంద్రమేనంటూ చెప్పించింది. అయినా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వేడి మాత్రం చల్లారడం లేదు.

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారని, ఇప్పుడు హైదరాబాద్ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. ఐదేళ్లు అధికారమిస్తే ఒక్క రాజధాని కూడా నిర్మించలేదని, మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టారని జీవీఎల్ మండిపడ్డారు.

bjp mp gvl narasaimharao suspects poll plan behind ysrcps hyderabad joint capital demand

ఇప్పుడు ఎన్నికల వేళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు కోరడం ప్రజల దృష్టి మరల్చేందుకేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. నాలుగో రాజధాని అంశం ఎన్నికల ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. దీనికి బదులు ఏపీ రాజధానిగా ఇప్పటికే గుర్తించిన అమరావతినే అభివృద్ధి చేస్తే మంచిదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఏపీ ఆత్మనిర్భర్ కావాలంటూ ఆయన ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+