జగన్ ఫేక్ ప్రచారం- మేం అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా?- బోండా ఉమ కౌంటర్..!

ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని అడ్డుకుని, తద్వారా రాష్ట్రానికి వచ్చే దాదాపు 20 వేల నిధుల్ని రాకుండా అడ్డుకోవాలనేది జగన్ కుట్ర అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) ఆరోపించారు. స్థానిక ఎన్నికలు జరిగితే వైసీపీ గుట్టు రట్టు కాబోతోందని, అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. అందుకే కోర్టుల ద్వారా అడ్డంకులు సృృష్టిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీలు, మాజీ మంత్రులు నామినేషన్లు వేసే వారిని భయబ్రాంతులు చేసారన్నారు. ఇదంతా చేసి తిరిగి దొంగే దొంగ అన్నట్లుగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు.

అవినీతికి, అప్రజాస్వామ్యానికీ కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని, దానికి అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని బోండా ఉమ తెలిపారు. తన క్రిమినల్ బుర్రతో రాజకీయ పార్టీని స్థాపించి, రాజకీయాల్ని లక్షల కోట్ల సంపాదనకు మార్గంగా ఎంచుకున్న వ్యక్తి జగన్ అన్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా, ఆయన పదవి అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచేసి, సీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. ఆ డబ్బుతో అధికారాన్ని సంపాదించుకుని, దాన్ని లక్షల కోట్లకు పెంచుకుంటూ ఇవాళ అన్ని రకాలుగా వైసీపీ దివాళాతీసే పరిస్ధితికి వచ్చాక, ఇప్పుడు కార్యకర్తలకు నమ్మకం కలిగించేందుకు అనేక మాటలు మాట్లాడుతున్నారన్నారు. మీ అవినీతికి రాజకీయ నేతలు, పారిశ్రామితవేత్తలు, అధికారులు అంతా జైలుకెళ్లింది నిజం కాదా ? జగన్ కు ఇవాళ ఎన్నికలు జరగడం ఇష్టం లేదన్నారు. అందుకే సుప్రీంకోర్టు వరకూ మొత్తం 59 కేసులు వేశారన్నారు.

Bonda Uma Accuses YS Jagan of Spreading Fake Propaganda Over AP Local Poll Violence
సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!
సుప్రీం ఆదేశాలూ బేఖాతర్- ఎస్ఈసీ ఏం చేస్తోంది? ఎన్నికల హింసపై జగన్ ఫైర్..!

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ పూర్తిగా అవాస్తవాలతో కొనసాగిందని బోండా ఉమ తెలిపారు. 59 కేసులు వేసి స్థానిక ఎన్నికలు జరిపించకుండా అడ్డుపడితే, వాటిని దాటుకుని తాము ఎన్నికలు నిర్వహిస్తుంటే.. తొలిరోజే రాజంపేట ఎంపీ ఏం చేశారో చూశారన్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వాళ్లను కార్లతో గుద్దించి పుంగనూరును రణరంగం చేశారని, తిరుపతిలో భూమన నామినేషన్ పత్రాలు చించేశారని, కాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే కూతురు దౌర్జన్యం చేసిందని, మాజీ మంత్రి రోజా రెడ్డి కూడా అధికారులపై దౌర్జన్యం చేసిందన్నారు. నంద్యాలలో కౌన్సిలర్ అభ్యర్ధి నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకుంటే జగన్ నానా యాగీ చేస్తున్నారన్నారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ కూడా విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఇవన్నీ అవాస్తవాలు అని, దౌర్జన్యాలు అని అబద్దాల ప్రచారం చేస్తున్నారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేవలం 1 శాతం ఏకగ్రీవాలు జరిగాయని, ఆ తర్వాత గెలిచిన జగన్ దాడులు, దౌర్జన్యాలతో 21 శాతం ఏకగ్రీవాలు చేయించుకున్నారని ఆరోపించారు.

Bonda Uma Accuses YS Jagan of Spreading Fake Propaganda Over AP Local Poll Violence
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు- ఎస్ఈసీ కీలక నిర్ణయం..!
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు- ఎస్ఈసీ కీలక నిర్ణయం..!

2024లోనే జగన్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. అందుకే ఇప్పుడు అరాచకాలతో స్థానిక ఎన్నికలు గెలవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రం మొత్తం స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకుంటున్నారని, ఫలితాలతో పార్టీ భూస్థాపితం అవుతుందనే భయంతోనే కోర్టులకు వెళ్లి జగన్ 59 కేసులు వేసారని, వాటిలో చీవాట్లు తిని ఇవాళ తిరిగి విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. 659 చోట్ల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే, వీటిలో వైసీపీ 1092 నామినేషన్లు వేసిందని, టీడీపీ కేవలం 1055 నామినేషన్లే వేసిందన్నారు. అలాగే 9829 ఎంపీటీసీ స్ధానాల్లో టీడీపీ అభ్యర్ధులు 15 వేల నామినేషన్లు వేస్తే, వైసీపీ 12419 నామినేషన్లు వేసిందన్నారు. జనసేన తరపున 2073 మంది నామినేషన్లు వేశారన్నారు. బీజేపీ 562 నామినేషన్లు చేసిందన్నారు.
2020లో జరిగిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భారీగా ఏకగ్రీవాలు చేయించుకుందని, నాడు జరిగిన పట్టణ స్థానిక సంస్థల్లో 20.72 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని, గ్రామీణ స్థానిక సంస్థల్లో 24 శాతం మేర ఎంపీటీసీ స్థానాలు, 19 శాతం మేర జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా బలవంతంగా చేజిక్కించుకున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+