వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 జిల్లాల్లో బాధపడ్డారు, అందుకే నాకు పదవి ఇవ్వలేదు: బోండా ఉమ

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చల్లబడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన కూల్ అయ్యారు. అప్పటి దాకా రాజీనామా చేస్తానని, ఏమాత్రం తగ్గేది లేదని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చల్లబడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన కూల్ అయ్యారు. అప్పటి దాకా రాజీనామా చేస్తానని, ఏమాత్రం తగ్గేది లేదని చెప్పారు.

చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో స్థానం రానందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. తాను చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు.

<strong>అఖిలప్రియ, సుజయలకు మంత్రి పదవి: బాబుపై ఊగిపోయిన జగన్</strong>అఖిలప్రియ, సుజయలకు మంత్రి పదవి: బాబుపై ఊగిపోయిన జగన్

తనకు మంత్రి పదవి రాలేదని 13 జిల్లాలలోని కార్యకర్తలు, అభిమానులు బాధపడ్డారని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. సమీకరణాల్లో భాగంగానే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారన్నారు.

Bonda Uma meets Chandrababu Naidu

పాత, కొత్త కలయికలతో ఈ కేబినెట్ విస్తరణ జరిగిందన్నారు. కొత్త వారికి చోటు కోసం తనలాంటి వారు త్యాగం చేశారని చెప్పారు. భవిష్యత్తులో తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు.

కాగా, బొండా ఉమా కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంతకుముందు ప్రకటించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన ఆయనకు మద్దతుగా స్థానిక కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు ఆయన్ను బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన కూల్ అయ్యారు.

English summary
MLA Bonda Umamaheswara Rao on Sunday met AP CM Chandrababu Naidu in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X