వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు సింగపూర్‌లో బిజినెస్: జగన్‌పార్టీలోకి బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయం లోటస్ పాండ్‌కు చేరుకున్న బొత్సకు వైసీపీఅధ్యక్షుడు జగన్‌ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యేలు అప్పల నర్సయ్య, అప్పలనాయుడు, డీసీసీబీ ఛైర్మన్‌ తులసి తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

చంద్రబాబు పైన పోరాడేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ప్రజావ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. తాను పదవుల కోసం జగన్ వద్దకు రాలేదన్నారు. అభివృద్ధిని కేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Botsa Satyanarayana joins YSR Congress

కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడలేమనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. నా అనుభవాన్ని వైసీపీ గెలుపుకోసం ఉపయోగిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను విస్మరిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో పోరాటాలు సంతృప్తి కలిగించలేవన్నారు. ఏపీ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం వైసీపీనే అన్నారు. సింగపూర్‌లో చంద్రబాబుకు వ్యాపారాలున్నాయని చెప్పారు.

English summary
Botsa Satyanarayana joins YSR Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X