కొనసాగుతున్న జవాన్ విధ్వంసం.. షారుక్ ఖాన్ యాక్షన్ కు అల్లు అర్జున్ ఫిదా!!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే, విడుదలైన వారం రోజుల్లోనే 650 కోట్ల రూపాయల మార్కును దాటి కలెక్షన్ల వరద కురిపిస్తుంది. వారం రోజుల్లోనే 600కోట్లు మార్కు దాటిన మొదటి హిందీ సినిమాగా జవాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
పఠాన్ సినిమా తర్వాత వరుస హిట్ ను కొట్టిన షారుక్ ఖాన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారని సినీ ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా షారుక్ ఖాన్ జవాన్ మేనియా నడుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి వంటి వారు షారుక్ ఖాన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ సినిమాపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జవాన్ లో షారుక్ ఖాన్ యాక్షన్ చూసి తాను ఫిదా అయ్యానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో భాగమైన నటీనటులు, టెక్నీషియన్లను అందరినీ అభినందించిన అల్లు అర్జున్ ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకునేందుకు జవాన్ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.
జవాన్ మూవీ పూర్తిగా షారుక్ ఖాన్ మాస్ అవతార్ అని, ఇందులో షారుక్ ఖాన్ స్వాగ్ చూసి ఫిదా అయ్యానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన పాత్రకు ప్రాణం పోశారని నయనతార, దీపికా పదుకొనే అద్భుతంగా నటించారని, అనిరుద్, రవిచంద్ర పాటలు పదేపదే వినేలా చేశాడన్నారు.
ఇక దర్శకుడు అట్లీ అల్టిమేట్ అంటూ ఆలోచింపజేసే కమర్షియల్ సినిమా తీసి ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు అభినందనలు అని జవాన్ టీం పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ జవాన్ సినిమాపై, షారుక్ ఖాన్ పై చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతుంది.












Click it and Unblock the Notifications