బ్రహ్మానందం రెండో కోడలు బ్యాగ్రౌండ్ తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన నటనతో, డైలాగులతోనే కాకుండా హావభావాలద్వారా కూడా ప్రజలను కడుపుబ్బా నవ్వించేవారు. తన కామెడీ టైమింగ్ అద్భుతమని చెప్పవచ్చు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయన 1300 సినిమాల్లో నటించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ లోకి ఎక్కిన బ్రహ్మానందానికి 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మను, బాసంతి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు పరాజయం పాలవడంతో ఆయన పరిశ్రమకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కుమారుడి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. తాజాగా తన రెండోకుమారుడి వివాహాన్ని బ్రహ్మానందం అంగరంగ వైభంగా జరిపించారు.

బ్రహ్మానందం ఇంట్లోకి రెండో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయి బ్యాగ్రౌండ్ బాగా బలంగానే ఉందంటున్నారు. కరీంనగర్ లో ప్రముఖ వైద్యులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పద్మజా వినయ్ ల కుమార్తె. పేరు ఐశ్వర్వ. తను కూడా గైనకాలజిస్ట్. వీరికి స్థిరచరాస్తులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య పేరుతో ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు. బ్రహ్మానందం ఆస్తి గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్లలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.తన స్తోమతకు తగినట్లుగా ఉంటారని బ్రహ్మానందం భావించడంతో ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications