Brahmotsavams: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు, సూర్యసంక్రమణం, గోవిందా గోవింద !
తిరుమల/ తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం సూర్యప్రభ వాహనంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. సూర్యప్రభవాహనంపై స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు క్యూ కట్టారు. సూర్యప్రభ వాహనంలో నాలుగు మాడ వీధుల్లో విహరించిన శ్రీవారికి అడుగడుగునా భక్తలు కర్పూరహారతలుపట్టారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి వెలుతున్నారు. కేంద్ర మంత్రులు సైతం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

తిరుమలలో ఆధ్యాత్మికానందం
సోమవారం సూర్యప్రభ వాహనంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 15 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.

సూర్యసంక్రమణం
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ గరుడాద్రివాసా భజన మండలి కళాకారులు ప్రదర్శించిన సూర్యకుటుంబం అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రాశుల్లో సూర్యసంక్రమణం విషయాలను తెలియజేశారు. ఇందులో సప్త అశ్వాలు, ద్వాదశాదిత్యులు, సూర్యుని తల్లి అదితి, తండ్రి కశ్యపుడు, అత్త ప్రహ్లాది, మామ విశ్వకర్మ, సూర్యుని భార్య సంజ్ఞాదేవి, సంతానం మనువు, యముడు, అశ్వనీదేవతలు, యమున, సూర్యుని శిష్యులు మనువు, యాజ్ఞవల్క్యుడు, హనుమంతుడు, ఆయా తెలుగు నెలల్లో సూర్యుడు సంక్రమించే విధానాలు తదితర వివరాలు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల కళాకారులు
కర్ణాటక కళాకారులు రామాయణం ఘట్టంలోని వేషధారణలతో అలరించారు. వీరిలో సీతారామలక్ష్మణులు, హనుమంతుడు, రావణాసురుడు తదితర వేషాలతో కళాకారులు అభినయించారు. వీరితోపాటు పాండిచ్చేరి కళాకారులు కాళియాట్టం, మహారాష్ట్ర కళాకారులు లెజిమ్ డ్రమ్స్, కడప కళాకారులు బళ్లారి డ్రమ్స్, వివిధ పౌరాణిక అంశాలతో రూపకాలు, కోలాటాలు ప్రదర్శించారు.

హిందూ ధర్మప్రచార పరిషత్
వాహన సేవల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ నుండి 52, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 25, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి 14 కలిపి మొత్తం 91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు పాల్గొన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో కళాకారులు పాల్గొన్నారని, వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు, వేషధారణ కళారూపాలను ప్రదర్శించారని తెలియజేశారు.

తెలంగాణ చెక్కభజన, కోలాటం
తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్రదర్శించారని చెప్పారు. కర్ణాటక నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లు కునిత, పూజ కునిత, సోమన కునిత, కంసాల కళారూపాలను ప్రదర్శించారని తెలిపారు. తమిళనాడు నుండి 12 బృందాలు వచ్చాయని అధికారులు తెలిపారు.

గోవిందా.... గోవింద
అదే విదంగా వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం, మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక బృందం, కేరళ నుండి ఒక బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక కళారూపాలను ప్రదర్శించారని వివరించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications