వధువులు కావలెను.. పండుగ ఫ్లెక్సీ లో ఏపీ యువత వినూత్న అప్పీల్!
సాధారణంగా గ్రామాలలో ఏమైనా పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. స్థానిక నాయకుల ఫోటోలు, యువత ఫోటోలు పెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అంతేకాదు పండుగకు సంబంధించి ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే, ఆ కార్యక్రమాలు వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అయితే చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి పల్లెలో సంక్రాంతి సందర్భంగా నిన్న పశువుల పండుగ నిర్వహించారు.
పండుగ సందర్భంగా విచిత్రమైన ఫ్లెక్సీ
ఈ పశువుల పండుగ లో యువత ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్లెక్సీ తో గ్రామానికి చెందిన యువత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అదే ఫ్లెక్సీలో పెళ్లిళ్లు కానీ యువకుల ఫోటోలను కూడా ముద్రించి, ఆ యువకుల ఫోటోలకు స్టార్ గుర్తులు పెట్టారు. ఇక ఫ్లెక్సీ పైన ముఖ్య గమనిక స్టార్ గుర్తులు పెట్టిన యువకులకు వధువులు కావలెను అని వినూత్న సందేశాన్ని ముద్రించారు.

ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్
చూడగానే నవ్వు తెప్పించే, ఆసక్తికరంగా అనిపించిన ఈ ఫ్లెక్సీ పశువుల పండుగకు వచ్చిన వారికి ప్రధాన ఆకర్షణగా కనిపించింది. ఇక పండుగకు గ్రామానికి వచ్చిన అతిథులు ఈ ఫ్లెక్సీలను చూసి ఆసక్తిగా అనిపించి ఫోటోలను తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
యువకుల ఫ్లెక్సీతో ఆసక్తికర చర్చ
పెళ్లి సంబంధాలు చూడడానికి ఇది కొత్త విధానం అని కొందరు, పాపం అమ్మాయిలు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు అని మరి కొందరు ఇలా ఈ ఫ్లెక్సీల పైన చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సామాజిక మాధ్యమాలలో ఈ ఫ్లెక్సీ వైరల్ కావడంతో ఇప్పటికైనా ఆ యువకులకు పెళ్లి కూతుళ్లు దొరకాలని కోరుతున్నారు.
ఏపీలో చర్చ
మొత్తంగా కలికిరి పల్లె యువకులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చను రేపింది. అబ్బాయిలకు పెళ్లికూతురు దొరకడం ఎంత కష్టంగా ఉంది అనే అభిప్రాయానికి కారణమవుతుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications