బాబుని మెచ్చుకొని చిక్కుల్లో గవర్నర్! 'జగన్ రూ.లక్ష కోట్లు ఉంటే..'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: గవర్నర్ నరసింహన్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మెప్పు కోసమే గవర్నర్ పని చేస్తున్నారని విమర్శించారు.

'రాజధాని నుంచి పాలన ఇలా': మాట్లాడుతుంటే బావలు సయ్యా పాట, బాబు అసహనం!

రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా సర్టిఫికేట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు ఆయనకు తెలియవా అని ప్రశ్నించారు.

C Ramachandraiah fires at Governor Narasimhan

ఫిరాయింపుల పైన గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. బీసీలు, కాపుల మధ్య చంద్రబాబు అగ్గి రాజేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ అగ్గిలో చంద్రబాబు బూడిద కావడం ఖాయమన్నారు.

జగన్ సొమ్ము రాజధాని నిర్మాణానికి ఉపయోగపడేది: ఆనం

తాను చేసిన అవినీతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ గడపగడపకూ తెలియజేస్తే బాగుంటుందని టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ఏపీలో వైసిపి పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే ఏం చేయాలో పాలుపోక గడపగడపకూ వైసిపి అనే కార్యక్రమం చేపడుతోందన్నారు.

బాబు, నేను కెప్టెన్లమే, కానీ: గవర్నర్ అసహనం, లోకేష్‌తో పరిచయం

జగన్ కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు ఉంటే మంచి రాజధాని నిర్మించుకునే వారమన్నారు. రాష్ట్రంలో ఒక పార్టీ కార్యాలయాన్ని ఈడీ జఫ్తు చేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదని, వైసిపి కార్యాలయం జఫ్తు ఓ రికార్డ్ అని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
C Ramachandraiah fires at Governor Narasimhan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి