ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పగలరా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇప్పటినుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ఈసారి ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని పొత్తుల సీట్లపై కసరత్తు కూడా చేస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.

జనసేన టిడిపి పొత్తుల నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా మాజీ పార్లమెంటేరియన్ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ కు కొన్ని ప్రశ్నలను సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

Can janasena chief Pawan Kalyan answer these questions?

హరిరామ జోగయ్య రాసిన లేఖలో చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. "అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి" అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకసార్లు ప్రకటించారు. కనుక "అందరి మాట ఇదే" అంటూ లోకేష్ బాబు కూడా ప్రకటించేశారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్టు గా చంద్రబాబు గారిని పూర్తి ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా? అంటూ ప్రశ్నించారు.

దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు.మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? అంటూ నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందన్నారు.

Can janasena chief Pawan Kalyan answer these questions?

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారు అని పేర్కొన్న ఆయన బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి ? అని నిలదీశారు.

ఈ ప్రశ్నలన్నింటికీ మీ నుండి జనసైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాల్సిందిగా కోరుతున్నామని హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్నది పవన్ కళ్యాణ్ ద్వారా సమాధానం కావాలని హరి రామ జోగయ్య తన లేఖ ద్వారా పేర్కొన్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+