Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు.. నోటీసులిచ్చిన పోలీసులు!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు. దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దివ్వెల మాధురి పుణ్యమా అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలలో సెలబ్రిటీగా మారిపోయాడు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు పోలీస్ కేసు నమోదు
ఇక గతంలో రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పైన దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేశారు.

Case registered against Duvvada Srinivas Police issued notices

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ
తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులను అందజేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలలోకి ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని మాత్రం ప్రశ్నించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని అందుకే చంద్రబాబును ఆయన ప్రశ్నించడం లేదని దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం
ఇక దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపైన జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు వంజారపు సింహాచలం మార్చి 8వ తేదీన శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

దువ్వాడకు పోలీసుల నోటీసులు
ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి లోని దువ్వాడ కార్యాలయంలో ఏఎస్ఐ చంద్రా రావు నోటీసులు అందజేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేసి నోటీసులు అందించిన పోలీసులు త్వరలోనే ఆయనను విచారించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+