జగన్ పై కేసు నమోదు..ఐపీఎస్‌లతో సహా- ఆటమొదలు..!!

మాజీ సీఎం జగన్‌‌తో పాటు సీనియర్ పోలీసు అధికారి పై కేసు నమోదు అయింది. గతంలో సీఐడీ డీజీగా పని చేసిన సునీల్ కుమార్ పైన రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసారు. రఘురామ రాజు వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో నాడు సీఐడీ కేసు నమోదు అయింది. ఆ సమయంలో సీఐడీ అధికారులు తనను కొట్టటంతో పాటుగా హత్యాయత్నంకు పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు చేసారు. ఇదంతా నాటి సీఎంగా ఉన్న జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సునీల్ కుమార్ గతంలో సీఐడీ డీజీగా పని చేశారు. గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ డీజీ సునీల్ కుమార్‌తోపాటు అతని బృందంలోని పలువురిపై సెక్షన్ 120బి,166,167,197,307,326,465,506(34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Raghurama raju

తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్‌, సునీల్‌ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అప్పట్లోనే రఘురామ చేసిన ఆరోపణలు రాజకీయ సంచలనంగా మారాయి. న్యాయస్థానంలోనూ రఘురామ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+