ఓటుకు నోటు: స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడారు?

అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఫోన్ సంభాషణలను విడుదల చేయడంలో కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

అయితే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, స్టీఫెన్‌సన్‌కు మధ్య జరిగిన వ్యవహారం మొత్తం ఎలా సాగింది. ఈ ఓటుకు నోటు ఆపరేషన్ కోసం రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్‌ను ఎప్పుడు కలిశారు. చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడించారనేది అందరి మదిలో తెలుసుకోవాలని ఉంది.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దొరికిన వీడియోలో బాసే తనని పంపించాడంటూ స్టీఫెన్‌తో చెప్పినట్లు ఉంది. అంతేకాదు తనకు బాస్ ఇచ్చిన అప్పర్ లిమిట్ 'రెండున్నర' అని కూడా చెప్పారు. దీంతో తాము ముగ్గురిని కలిసి మూడు ఇచ్చామని చెప్పారు.

Cash-for-vote: Uproar over Andhra CM Naidu, MLA phone conversation

ఈ విషయాన్ని మీరే డైరెక్టుగా సార్‌తో మాట్లాడుకోవచ్చని చెప్పారు. దీనికి బదులుగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, సార్ ఎప్పుడు కలుస్తారని అడిగాడు. రేవంత్ రెడ్డి 'ఇప్పుడే ఫోన్ లో మాట్లాడిస్తా' అని చెప్పారు. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే, మీకు ఎక్కడ కావాలో చెప్తే అక్కడే ఇస్తామని, ఈ విషయాన్ని సార్‌తో చెప్తానని అన్నారు.

ఈ సమయంలోనే చంద్రబాబు తరపున మనిషి ఫోన్‌లో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారు.

బాబు - స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ చంద్రబాబు తరపు మనిషి - హాలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ బి ఆన్ ద లైన్..(హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి)

స్టీఫెన్ : యా..
బాబు : హలో..
స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్..
బాబు : హౌ ఆర్ యూ(మీరు ఎలా ఉన్నారు?).
స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్..
బాబు : మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్..(మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేను ఉంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు).
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్.
బాబు : ఫర్ ఎవ్రీథింగ్ ఐయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్.. విల్ హానర్..(అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం).
స్టీఫెన్ : యస్ సార్.. రైట్ సార్.. బాబు : ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్..(మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు....ఎలాంటి సమస్య లేదు).
స్టీఫెన్ : ఓకే సార్..
బాబు : దటీజ్ అవర్ కమిట్‌మెంట్.. వి విల్ వర్క్ టు గెదర్(అది మా హామీ.. మనం కలిసి పని చేద్దాం).
స్టీఫెన్ : రైట్.. థాంక్యూ సార్..
బాబు : థాంక్యూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+