ఆ అర్థం బెయిలివ్వాలని కాదు: జగన్‌పై సిబిఐ కౌంటర్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాఫ్తును పూర్తి చేశామని, త్వరలో విచారణ ప్రారంభమవుతుందని సిబిఐ కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది.

జగన్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని మాత్రమే సుప్రీం కోర్టు నిర్ధిష్ట కాలపరిమితిని విధించిందని, దాని అర్థం జగన్‌కు బెయిల్ ఇవ్వాలని కాదని, జగన్‌కు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానం ఎక్కడా పచ్చజెండా ఊపలేదని పేర్కొంది. జగన్ రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడిన వ్యక్తి అని, ఆయన బయటకు వస్తే దర్యాఫ్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు.

అందుకే బెయిల్ ఇవ్వవద్దన్నారు. త్వరలో కేసుపై ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్నారు. ఆయన ప్రభావం చూపగల వ్యక్తి అన్నారు. బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు వాదనలు పూర్తయ్యాయి. సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది.

కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాను పిటిషన్ దాఖలు చేస్తున్నానని జగన్ ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ ఈ రోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+