వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18న హాజరు నుంచి జగన్‌కు కోర్టు మినహాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఊరట లభించింది. లేపాక్షి నాలెడ్జి హబ్ కేసులో ఈ నెల 18వ తేదీన కోర్టుకు హాజరు కావడం నుంచి ఆయనకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆ రోజు కోర్టుకు హాజరు కాలేనని చెబుతూ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

జగన్ విజ్ఞప్తిని సిబిఐ కోర్టు అంగీకరించింది. లేపాక్షి నాలెడ్జి హబ్ కేసులో మంత్రి జె. గీతారెడ్డితో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా నిందితులుగా ఉన్నారు. లేపాక్షి నాలెడ్జి హబ్ కేసును కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది.

YS Jagan

అనంతపురం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రాజెక్టు విషయంలో సిబిఐ గీతారెడ్డికి ఇంతకు సమన్లు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంపై సిబిఐ సమర్పించిన చార్జిషీట్‌ను కోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించింది. ఈ మేరకు నిందితులకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

అనంతపురం జిల్లాలోని రెండు మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్ఱభుత్వం 8,842 ఎకరాల భూములను కేటాయించింది. ఈ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలను కాలారాశారనే ఆరోపణలున్నాయి. దాంతో వైయస్ జగన్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహారం నడిచిందని ఆరోపిస్తున్నారు.

దాదాపు యాభై శాతం భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పులు తీసుకున్నట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు సిబిఐ ఆపోపిస్తోంది. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ భూముల కేటాయింపు జరిపినప్పుడు జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల మంత్రిగా, ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితులు జగన్ సహా బెయిల్‌పై విడుదలై బయట ఉన్న విషయం తెలిసిందే.

English summary
YSR Congress president YS Jagan has permitted to go to Delhi on Navember 18, though hearing on Lepakshi knowledge hub case is on. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X