AP Elections: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు-ఈసీ ఆమోదం..!
ఏపీలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులు(ఓ ఐజీ, ఐదు జిల్లాల ఎస్పీలు)పై కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్యే బదిలీ వేటు వేసింది. వీరిని ఎన్నికలు ముగిసేవరకూ ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ విధులూ అప్పగించవద్దని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని తప్పించక తప్పలేదు. ఇప్పుడు వారి స్ధానాల్లో ఇతర అధికారులను నియమిస్తూ రాష్ట్రం పంపిన ప్రతిపాదనల్ని ఈసీ ఆమోదించింది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసీ ఆమోదానికి పంపిన పేర్లలో కృష్ణాజిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్ గా వి.వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, ప్రకాశం ఎస్పీగా గరుడ్ సుమీత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ఉన్నారు. వీరందరి పేర్లకు ఈసీ ఆమోదం తెలపడంతో వీరు బాధ్యతలు చేపట్టబోతున్నారు.

తాము ఆమోదం తెలిపిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులంతా తక్షణం బాధ్యతలు చేపట్టాలని కూడా ఈసీ తమ ఆదేశాల్లో తెలిపింది. దీంతో వీరంతా కొత్త పోస్టింగ్ ఇచ్చిన స్ధలాలకు పయనం అయ్యారు. ఈసీ చర్యల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో వీరంతా కీలకం కానున్నారు. ప్రస్తుతం దాదాపుగా అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వీరందరికీ తాజాగా ఈసీ చేపట్టిన బదిలీలు వరంగా మారినట్లయింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications