Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెలకు రూ.80 కడుతూ ఒకేసారి రూ.3.4 లక్షలు పొందండి!

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేకరకాల పథకాలను అందుబాటులోకి స్తోంది. అలా తెచ్చినవాటిలో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం గురించి చలామందికి అవగాహన లేదు. 2015 నుంచి ఇది అమల్లో ఉంది. ఉద్యోగం చేస్తూ రిటైరయ్యేవారు, పదవీ విరమణ చేసిన తర్వాత నెలనెలా కొంత ఆదాయం కావాలనుకునేవారికి ఈ పథకం చాలా బాగుంటుంది. అసంఘటిత రంగంలోకి కార్మికులు ఈ పథకంలో చేరితే వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెల నెలా కొంత పింఛను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే నామినీ ఎవరైతే ఉంటారో వారికి భారీమొత్తంలో చేతికి వస్తుంది.

అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడం వల్ల నెలకు రూ. వెయ్యి రూపాయల నుంచి వరుసగా, 2, 3, 4, రూ.5వేల వరకు పింఛను పొందొచ్చు. మనకు ఏ పథకం కావాలనేది మనం ఎంచుకునేదాన్ని బట్టి ఆధారపడివుంటుంది. మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంతనేది ఎంపిక చేసుకోండి. మనకు కావాలనుకున్నదాని ప్రకారం నెల నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. ఒకవేళ ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే నామినీకి పూర్తిడబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. మాములుగా అయితే డబ్బులు కడుతూ వచ్చిన తర్వాత ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే భాగస్వామికి పెన్షన్ లో సగం మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే డిపాజిట్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.

central government scheme atal pension yojana

ఈ పథకంలో చేరడంవల్ల ముగ్గురికీ ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు మీకు 18 సంవత్సరాల వయసు ఉంటే... మీరు 42 సంవత్సరాలపాటు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మీకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నుంచి పెన్షన్ వస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.. నెలకు రూ.42 కడుతూ రావాలి. ప్రతి నెలా రూ.వెయ్యి పింఛనుతోపాటు సబ్ స్క్రైబర్ మరణించిన తర్వాత రూ.1.7 లక్షలు వస్తాయి. ఒకవేళ మనకు నెలకు రూ.2వేల పెన్షన్ కావాలనుకుంటే నెలకు రూ.84 కడుతూ రావాలి.

central government scheme atal pension yojana

ఒకవేళ సబ్ స్క్రైబర్ మృతిచెందిన తర్వాత నామినీకి రూ.3.4 లక్షలు అందజేస్తారు. ఒక్క పథకం ద్వారా అనేకరకాల ప్రయోజనాలను అటల్ పెన్షన్ యోజన అందిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను ఈ తరహాలోనే అందజేస్తోంది. వాటికి సంబంధించిన అన్ని వివరాలకు మీ సమీపంలోని తపాలాశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇప్పటివరకు మీరు వినని పథకాలెన్నో వారు చెబుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+